అందాల తార

పల్లవి:   అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో

అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్

ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో

ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి                 .. అందాల తార..

1.       విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను

వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున

విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో

విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్            .. అందాల తార..

2.       యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు

ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి

ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో

ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..

3.       ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే

బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను

ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము

బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన    .. అందాల తార..

 

అపరాధిని యేసయ్య

పల్లవి:   అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా

నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు       ..అపరాధిని..

1.       సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని

కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా         ..అపరాధిని..

2.       ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే

మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో               ..అపరాధిని..

3.       ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి

నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ                  ..అపరాధిని..

4.       దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి

ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను             ..అపరాధిని..

5.       ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని

క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా          ..అపరాధిని..

అన్ని నామముల కన్న

పల్లవి:  అన్ని నామముల కన్న పై నామము-యేసుని  నామము

ఎన్ని తరములకైన ఘనపరచ దగినది-క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ ఆమెన్                         (2X)

1.      పాపముల నుండి విడిపించును-యేసుని  నామము

నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును-క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ ఆమెన్                         (2X)

2.      సాతాను పై అధికార మిచ్చును-శక్తి గల  యేసు నామము

శత్రు సమూహము పై జయమునిచ్చును-జయశీలుడైన యేసు నామము

యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ ఆమెన్                         (2X)

3.      స్తుతి ఘన మహిమలు చెల్లించుచు-క్రొత్త కీర్తన పాడెధము

జయ ధ్వజమును పైకెత్తి కేకలతో-స్తోత్ర గానము చేయుదము

యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ ఆమెన్                         (2X)

అన్ని నామముల కన్న పై నామము-యేసుని  నామము

ఎన్ని తరములకైన ఘనపరచ దగినది-క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ ఆమెన్                         (2X)

 

ఆడెదన్ పాడెదన్

పల్లవి:  ఆడెదన్పాడెదన్యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

ఆడెదన్పాడెదన్యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

1.      నను దర్శించి నూతన జీవం యిచ్చిన సన్నిధిలో

నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో                             (2X)

ఆడెదన్పాడెదన్ దేవుని సన్నిధిలో

స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో

ఆడెదన్పాడెదన్యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

2.      పరిశుద్దాత్మజ్వాల రగిలించి నన్ను మండించిన సన్నిధిలో

పరిశుద్దాత్మలో నను అభిషేకించిన యేసుని సన్నిధిలో                     (2X)

ఆడెదన్పాడెదన్ దేవుని సన్నిధిలో

స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో

ఆడెదన్పాడెదన్యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

ఆడెదన్పాడెదన్యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

 

ఆరాధించెదను

పల్లవి: ఆరాధించెదను నిన్నునా యేసయ్య  - ఆత్మతో సత్యముతో                      (2X)

ఆనందగానముతో -  ఆర్భటనాదముతో                                        (2X)

ఆరాధించెదను నిన్నునా యేసయ్య -  ఆత్మతో సత్యముతో                         (2X)

1.     నీ జీవవాక్యము నాలో -   జీవము కలిగించే                                      (2X)

జీవిత  కాలమంత,  నా యేసయ్య  -  నిన్నే కొలిచెదను                        (2X)

ఆరాధించెదను నిన్నునా యేసయ్య  -  ఆత్మతో సత్యముతో                        (2X)

2.     చింతలెన్ని కలిగినను -  నిందలన్ని నన్ను చుట్టినా                              (2X)

సంతోషముగ నేను,   నా యేసయ్య -  నిన్నే వెంబడింతును                    (2X)

ఆరాధించెదను నిన్నునా యేసయ్య  -  ఆత్మతో సత్యముతో                        (2X)

ఆనందగానముతో -  ఆర్భటనాదముతో                                           (2X)

ఆరాధించెదను నిన్నునా యేసయ్య  - ఆత్మతో సత్యముతో                         (2X)

 

ఆలయంలో ప్రవేశించండి

పల్లవి:  ఆలయంలో ప్రవేశించండి అందరూ

స్వాగతం సుస్వాగతం యేసునామంలో

మీ బ్రతుకులో పాపమా కలతలా

మీ హృదయంలో బాధలా కన్నీరా

మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం

1.     దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై

వెదకే వారికంతా కనబడు దీపము

యేసురాజు మాటలే వినుట ధన్యము

వినుట వలన విశ్వాసం అధికమధికము

ఆత్మలో దాహము తీరెను రారండి

ఆనందమనందం హల్లెలూయా                                ..ఆలయంలో..

2.        ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై

జీవ వృక్షంబుగా ఫలియించాలని

పెదవితో పలికెదం మంచి మాటలే

హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై

నింపెదం నిండెదం కోరేదం పొందెదం

ఆనదంమానదం హల్లెలూయా                                 ..ఆలయంలో..

 

ఆశ్చర్యమైన ప్రేమ

పల్లవి:   ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ

మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ

1.        పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ

నన్ను కరుణించిఆదరించిసేదదీర్చినిత్య జీవమిచ్చె              

ఆశ్చర్యమైన ప్రేమ

2.       పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ 

నాకై మరణించిజీవమిచ్చిజయమిచ్చితన మహిమ నిచ్చే       

ఆశ్చర్యమైన ప్రేమ

3.       శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ

విడనాడనిప్రేమదిఎన్నడుయెడబాయదు                       

ఆశ్చర్యమైన ప్రేమ

4.       నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ

నాకై పరుగెత్తికౌగలించిముద్దాడికన్నీటిని తుడిచే                

ఆశ్చర్యమైన ప్రేమ…  

 

ఆహా మహానందమే

పల్లవి:   ఆహా మహానందమే - ఇహ పరంబులన్ 

మహావతారుండౌ  - మా యేసు జన్మ దినం - హల్లేలూయ           .. ఆహా ..

1.      కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు                (2X)

మాన్యులౌ  పేద గొల్లలెందరో - అన్యులౌ  తూర్పు జ్ఞానులెందురో         (2X) 

నిన్నారాధించిరి - హల్లేలూయ                                       .. ఆహా ..

2.      యెహోవా తనయా - యేసు ప్రభూ   సహాయుడా - మా స్నేహితుడా     (2X)

ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము(2X)

నిన్నారాధింతుము - హల్లేలూయ                                   .. ఆహా ..

3.      సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో            (2X)

సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో           (2X)

నిన్నారాధింతుము - హల్లేలూయ                                   .. ఆహా ..

 

అత్యున్నత సింహాసనముపై

పల్లవి:  అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే

ఆహాహా ... హల్లేలూయ  (4X)

ఆహాహా ... హల్లేలూయ  (3X)  ...ఆమెన్

1.      ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం

ఆహాహా

2.      కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం

నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం

ఆహాహా

3.      ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం

అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం

ఆహాహా

4.      మ్రుత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం

మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం

ఆహాహా…    

 

ఇది కోతకు సమయం

పల్లవి:  ఇది కోతకు సమయం = పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా

పైరును చూచెదమా = పంటను కోయుదమా

1.      కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే

ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే                       ..ఇది కోతకు..

2.      సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా

యజమాని నిధులన్ని మీకేగదా                              ..ఇది కోతకు..

3.      శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా

జీవార్ధ ఫలములను భుజియింతమా                       ..ఇది కోతకు..  

 

ఉన్నతమైన ప్రేమ

పల్లవి:    ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ

శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ

యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా

1.        నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా

నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ                          (2X)

మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ              (2X)

ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా                      

… ఉన్నతమైన ప్రేమ …

2.        నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును

నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో           (2X)

నీవు కార్చిన రక్తమే నా -  ముక్తి మార్గమై                   (2X)

ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా                      

… ఉన్నతమైన ప్రేమ …    

 

ఉన్నతమైన స్థలములలో

పల్లవి:    ఉన్నతమైన స్థలములలో  - ఉన్నతుడా మా దేవా

ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా                  || ఉన్నత ||

1.       చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం

మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు

నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా

నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నిలుపుము దేవా        || ఉన్నత ||

2.        పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను

ఆయాసకరమైన మార్గము మాలో - వున్నదేమో పరికించు చూడు

జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము

మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా         || ఉన్నత ||

3.        మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగా ప్రోక్షించెదము

సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో

నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము

లోకమున నీ వార్తను మేము - భారము తోడ ప్రకటించెదము          || ఉన్నత || 

 

ఊహల కందని లోకములో 

పల్లవి:    ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు        (2X)

oటివిగా నిరంతరము ఉన్నతుడా  సర్వోన్నతుడా          (2X)

1.        సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని            (2X)

స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా            (2X)

హల్లేలూయహల్లేలూయహల్లెలూయాహల్లేలూయ     (2X)

… ఊహల …

2.        ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా   (2X)

సర్వాధికారుండా సర్వేశ సజీవుండా                         (2X)

హల్లేలూయహల్లేలూయహల్లెలూయాహల్లేలూయ     (2X)

… ఊహల …    

 

ఎందుకో నన్నింతగ నీవు

పల్లవి:    ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా 

అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్యా 

1.        నా పాపము బాప నరరూపి వైనావు - నా శాపము మాప నలిగి వ్రేలాడితివి

నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే                              

.. హల్లెలూయ..

2.        నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించు చున్నావు 

నీవు నన్ను ఎన్ను కొంటివి  నీ కొరకై నీ క్రుపలో                

.. హల్లెలూయ..

3.        నా శ్రమలు సహించి నా ఆశ్రయ మైనావు - నా వ్యధలు భరించి నన్నా దు కొన్నావు 

నన్ను నీలో చూచుకున్నావు నను దాచి యున్నావు         

.. హల్లెలూయ.. 

 

ఒకసారి ఆలోచించవా 

పల్లవి:    ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా

ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ                                   (2X)   

నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో                       (2X)

… ఒకసారి

1.       తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో            (2X)

నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను                      .

.         ..నీ జీవిత

2.        దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి                  (2X)  

లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా               

...నీ జీవిత …

3.        లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు         (2X)

నేనే మార్గముసత్యముజీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా   

...నీ జీవిత … 

 

ఓ యేసు నీ దివ్య ప్రేమ

పల్లవి:    ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా

విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ                        (2X)

1.        సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి                   (2X)

కలుషము బాపిన యేసయ్యకి

అలుపెరుగక ప్రార్ధన చేయుదము                                    

..ఓ యేసు..

2.        తరతరములలో నీ నామము  వరముల నొసగిన పై నామను        (2X)

అరయగ అరుదెంచావయ్య

మొరలిడుదును మదిలో నేనయ్య                                    

..ఓ యేసు..   

 

ఓ నీతి సూర్యుడా

పల్లవి:    ఓ నీతి సూర్యుడా -  క్రీస్తేసు నాథుడా

నీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూ

నన్ను వెలిగించుమా                                                .. ఓ నీతి..

1.        నేనే లోకానికి - వెలుగై యున్నానని 

మీరు లోకానికి - వెలుగై యుండాలని 

ఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూ

నన్ను వెలిగించుమా                                                .. ఓ నీతి..

2.        నా జీవితమునే - తూకంబు వేసిన 

నీ నీతి త్రాసులో - సరితూగ బోనని 

నే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూ

నన్ను వెలిగించుమా                                                .. ఓ నీతి..  

 

ఓరన్న  ఓరన్న

పల్లవి:     ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న

యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా                                  (2X)

1.            చరిత్రలోనికి వచ్చాడన్నా- పవిత్ర జీవం తెచ్చాడన్నా               (2X)

                అద్వితీయుడు ఆదిదేవుడు-ఆదరించెను ఆదుకొనును           (2X)

ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న

యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా                                (2X)

2.         పరమును విడచి వచ్చాడన్నా- నరులలో నరుడై పుట్టాడన్నా        (2X)

                పరిశుద్దుడు పావనుడు-ప్రేమించెను ప్రాణమిచ్చెను                       (2X)

ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న

యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా                                  (2X)

3.         శిలువలో ప్రాణం పెట్టా డ న్నా-మరణం గెలిచి లేచాడన్న              (2X)

                మహిమ ప్రభూ మృత్యంజయుడు-క్షమియించును జయమిచ్చును (2X)

ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న

యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా                                   (2X)    

 

కనుమా సిలువపై

పల్లవి:   కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 

మనకై సిలువపై మేకులతో కొట్టబడెను

కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 

మనకై సిలువపై మేకులతో కొట్టబడెను                          

1.       ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను                   

ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను       

ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను                   

ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను         

ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు    (2X) 

కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 

మనకై సిలువపై మేకులతో కొట్టబడెను

2.       బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                   

కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను                        

బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                   

కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను

అలసిసొలసినిస్సాహాయుడై తాను నిలిచెను     (2X)

కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 

మనకై సిలువపై మేకులతో కొట్టబడెను

మేకులతో కొట్టబడెను

మేకులతో కొట్టబడెను  

 

కల్వరిగిరిలోన సిల్వలో 

పల్లవి:    కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను

          ఘోరబాధలు పొందెను నీ కోసమే అది నా కోసమే            (2X)

1.        వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు

దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు         (2X) 

2.        సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి 

సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు                (2X)   

 

కలువరి గిరి సిలువలో

పల్లవి:   కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా      (2X)

విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా          (2X)

యేసు దేవ నీదు త్యాగం - వివరింప తరమా                (2X)

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా 

1.       కరుణ లేనికఠిన లోకం - కక్షతో సిలువేసిన                (2X)

కరుణ చిందు మోము పైన - గేలితో ఉమ్మేసిన              (2X)

ముల్లతోను,  మకుటమల్లి - నీదు శిరమున నుంచిరా                          

నీదు శిరమున నుంచిరా                                            

కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా 

2.       జాలి లేని పాప లోకం - కలువ లేదు చేసిన                 (2X)

మరణ మందు సిలువలోన - రుదిరమేనిను ముంచిరా      (2X)

కలుష రహిత వ్యధను చెప్పి - అలసి సొలసి పోతివా

అలసి సొలసి పోతివా                                              

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా      (2X)

విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా          (2X)

యేసు దేవ నీదు త్యాగం  వివరింప తరమా                 (2X)

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా     

 

క్రీస్తు నేడు లేచెను

1.        క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ 

మర్త్య దూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ 

భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ 

బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ 

2.        మోక్షమియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ 

యుద్దమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 

సూర్యుడుద్బ వింపగ  ఆ ఆ ఆ హల్లెలూయ 

చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ 

3.        బండముద్రకావలి  ఆ ఆ ఆ హల్లెలూయ 

అన్ని వ్యర్ద మైనవి  ఆ ఆ ఆ హల్లెలూయ 

యేసు నరకంబును  ఆ ఆ ఆ హల్లెలూయ 

గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 

4.        క్రీస్తు లేచినప్పుడు  ఆ ఆ ఆ హల్లెలూయ 

చావుముల్లు త్రుంచెను  ఆ ఆ ఆ హల్లెలూయ 

ఎల్ల వారి బ్రోచును  ఆ ఆ ఆ హల్లెలూయ 

మ్రుత్యువింక గెల్వదు  ఆ ఆ ఆ హల్లెలూయ     

 

గగనము చీల్చుకొని

పల్లవి:    గగనము చీల్చుకొని  యేసు  ఘనులను తీసుకొని 

వేలాది దూతలతో  భువికి  వేగమె రానుండె

1.       పరలోక పెద్దలతో పరివారముతో కదలి

ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో          … గగనము

2.       మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను 

కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో               … గగనము

3.       కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు

ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు      … గగనము…    

 

గీతం గీతం జయ జయ గీతం

పల్లవి:    గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి  పాడెదము ఆ ఆ 

యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము

1.        చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను 

అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు          ..గీతం..

2.        వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు 

తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి             ..గీతం..

3.        అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి

ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి             ..గీతం..

4.        గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా 

మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి                           ..గీతం..  

 

గెత్సేమనే తోటలో

పల్లవి:    గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా 

ఆ ప్రార్దనే మాకునిలా - రక్షణను కలిగించెను 

ఆ...ఆ...ఆ...ఆ...                                             ..గెత్సేమనే..

1.        నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యెద్ద నుండి తొలగించుమని 

దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి                  ..గెత్సేమనే..

2.        ఆ ప్రార్దనే మాకు నిలా - నీ రక్షణ భాగ్యంబు కలిగించెను 

నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాకు           ..గెత్సేమనే..   

 

చిరకాల స్నేహితుడా

పల్లవి:    చిరకాల స్నేహితుడానా హృదయాన సన్నిహితుడా                           (2X)  

నా తోడు  నీవయ్యానీ స్నేహం  చాలయ్యా

నా నీడ  నీవయ్యా,  ప్రియ ప్రభువా యేసయ్యా

చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                     (2X)

1.        బంధువులు వెలివేసినవెలివేయని  స్నేహం

లోకాన లేనట్టి ఓ దివ్య  స్నేహం,  నాయేసుని  స్నేహం

చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                     (2X)

2.        కష్టాలలోకన్నీళ్లలో,  నను మోయు  నీ స్నేహం

నను ధైర్యపరచి  ఆదరణ కలిగించునాయేసుని  స్నేహం

చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                     (2X)

3.        నిజమైనదివిడువనిధి,  ప్రేమించు నీ స్నేహం

కలువరిలొ చూపిన,  ఆ సిలువ స్నేహం,  నాయేసుని  స్నేహం

చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                     (2X)

చిరకాల స్నేహితుడా…  

 

జయము క్రీస్తూ

పల్లవి:   జయము క్రీస్తూ -  జయ జయ లివిగో 

భయము దీరె మరణముతో

జయము క్రీస్తూ -  జయ జయ లివిగో 

భయము దీరె మరణముతో

సిలువ జయము మాకోసంబే

తులువ బ్రోవ విజయమహో   

సిలువ జయము మాకోసంబే

తులువ బ్రోవ విజయమహో   

జయము క్రీస్తూ -  జయ జయ లివిగో 

భయము దీరె మరణముతో

1.       దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి

దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి

సాతానుని జాడ - సిలువలోనే దునుమాడ

జయగీతం రహిబాడ                                                 || జయము ||

2.       పాతాళము నొంచి - పరలోకము దెరచి

పాతాళము నొంచి - పరలోకము దెరచి

పాపాత్ముల కెంత - భాగ్యమెంచె క్షమియించె

పాడుదమా స్తుతియించి                                           || జయము ||  

 

పరమ పావనుడు

పల్లవి:    పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2x)

మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ

అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం  ||పరమ|| 

1.        దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ  (2x)

వినరండి బాల యేసుని దివ్యగాథను 

కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును                ||పరమ||

2.        తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2x)

అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ            ||పరమ|| 

 

ప్రభువా నీ కార్యములు

పల్లవి:    ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి

దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి               (2X)

నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా    (2X)

1.        హాలేలూయ హాలేలూయ  

భరియింపరాని  దు:ఖములు  యిహమందు నను చుట్టిన

నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి              (2X)

నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి

నీదు సాక్షిగా యిలలో జీవింతును

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా    (2X)

2.        హాలేలూయ హాలేలూయ

లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో

నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి             (2X)

నిర్దోషిగ చేయుటకై నీవు ధోషివైనావు

నీదు సాక్షిగా యిలలో జీవింతును

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా    (2X)

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి

దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి               (2X)   

నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా   (2X)  

 

పాడెదము వేడెదము

పల్లవి:    పాడెదము వేడెదము యేసు నామము

వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము

1.        ఈ లోక మందునా అంథకార మందునా  (2X)

దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి

..పాడెదము ..

2.       శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా   (2X)

దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము

..పాడెదము ..

3.       ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును    (2X)

దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం

..పాడెదము ..  

 

ప్రార్ధన వినెడి పావనుడా

పల్లవి:      ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా                     ..ప్రార్ధన..

1.        శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు  నేర్పితివి

పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్ధన నేర్పుమయా     ..ప్రార్ధన..

2.        పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగ మోడ్చి = శిరమును

వంచి సరిగమ వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా                        ..ప్రార్ధన..

3.        దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు

దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా                            ..ప్రార్ధన..

4.        శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను జంపగను

శాంతముతో నీ - శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా           ..ప్రార్ధన..  

 

మహోదయం శుభోదయం

పల్లవి:    మహోదయం  శుభోదయం  సర్వలోకాని కరుణోదయం

శ్రీయేసు రాజు జన్మ దినం  భూప్రజలెల్లరి హృదయానందం 

1.        సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు 

క్రుపామయుడు సత్య సంపూర్ణుడు  క్రీస్తేసు రాజు జన్మ దినం 

ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా (2x)

2.        ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప 

కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం 

ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా (2x)  

 

మరణము గెలిచెను మన ప్రభువు

పల్లవి:   మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ        (2X)

         ఎంత ప్రేమఎంత త్యాగంజయించె సమాధినీ                        (2X)

          మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ

1.       పాపపు ఆత్మల రక్షణకై - గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై               (2X)

          నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు                                     (2X)

          ఎంత జాలిఎంత కరుణ యికను మన పైన                          (2X)

          మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ        (2X)            

2.       నేడే పునరుద్దాన దినం - సర్వ మానవాళికి పర్వ దినం                (2X)

          పాపపు చెర నుండి విడుదల                                        (2X)

          ఎంత ధన్యంఎంత భాగ్యం - నేడే రక్షణ దినం                         (2X)            

          మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ        (2X)  

 

తర తరాలలో

పల్లవి:    తర తరాలలోయుగ యుగాలలోజగ జగాలలో

దేవుడు ...దేవుడు ...యేసే దేవుడు ఆ ..ఆ .. ఆ ..

హల్లెలూయ ..హల్లెలూయ ..హల్లెలూయ ..

1.        భూమిని పుట్టింపక మునుపు - లోకము పునాది లేనపుడు  .. దేవుడు

2.        సృష్టికి శిల్పాకారుడు - జగతికి ఆది సంభూతుడు                      .. దేవుడు

3.        తండ్రి కుమార ఆత్మయు - ఒకటై యున్నా రూపము              .. దేవుడు… 

 

దేవా నీకు స్తోత్రము

దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము

దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము

దీవించుము - నను ఈ దినము

దీవించుము - నను ఈదినము

జీవింతు నే నీకోసము

జీవింతు నే నీకోసము

ఆ ..ఆమెన్!  ఆ ..ఆమెన్!  ఆ ..ఆమెన్!  

 

దైవం ప్రేమ స్వరూపం

పల్లవి:    దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే – అవనిలో  

దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే

 .. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం                

 …. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం         … దైవం

1.        ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం

ఈ ధరలో ప్రేమ శూ న్యం - ఆదరణలేని గమ్యం                    

మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి

మధురంపు యేసు ప్రేమా - మదినింపు మధుర శాంతి       … దైవం

2.        కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై                     

కరుణించి క్రీస్తు నీ కై - మరణించే సిలువ బలియై

పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్

పరలోక దివ్య ప్రేమాన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్            … దైవం…  

 

నా పేరే తెలియని ప్రజలు

          నా పేరే తెలియని ప్రజలు ఎందరో వున్నారు 

             నా ప్రేమని వారికి ప్రకటింప కొందరే వున్నారు                          (2X)

పల్లవి:    ఎవరైనా మీలో ఎవరైనా  - వెళతారా నా ప్రేమని చెబుతారా            (2X)

1.        రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది వున్నారు 

              మారు మూల గ్రామాల్లో - వూరి లోపలి వీధుల్లో       (2X)  .. ఎవరైనా..

2.        నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు 

             వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు                   (2X)  .. ఎవరైనా..

3.        వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి 

              వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి                     (2X)  .. ఎవరైనా.. 

 

నా యేసు రాజుతో నేను సాగి పోదును 

పల్లవి:    నా యేసు రాజుతో నేను సాగి పోదును                                                 (2X)

సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను              (2X)

          సాతనును పార ద్రోలెదను - 

 

ఆత్యున్నత   సిం హాసనము పై

ఆత్యున్నత   సిం హాసనము పై   

ఆసీనుడవైన  దేవా

ఆత్యంత ప్రేమా  స్వరూ పివి   నీవే  అరాధింతుము నిన్నే   (2) 

    ఆహాహా  -- హల్లెలుయ...ఆహాహా ఆమెన్...(8)

2.                   ఆశ్చర్యకరుడా స్తొత్రం ఆలొచన  కర్తా స్తొత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రీ 

సమాధాన  అధిపతీ స్తొత్రం (2)

 

    ఆహాహా  --హల్లెలుయ...ఆహాహా ఆమెన్...(8)

3.                   కృపా సత్య సంపూర్ణుడ స్తొత్రం 

కృపలో రక్షించితివే స్తొత్రం 

నీ రక్త మిచ్చి  విమోచించి నావే నా రక్షణా కర్తా  స్తొత్రం (2)

 

    ఆహాహా  --హల్లెలుయ...ఆహాహా ఆమెన్...(8)

4.                   ఆమేన్  అనువాడ స్తొత్రం...అల్ఫా ఒమేగా స్తొత్రం  

అగ్ని జ్వలల వంటి  కన్నులు గలవడా

 అత్యున్నతుడా  స్తొత్రం

 

    ఆహాహా  --హల్లెలుయ...ఆహాహా ఆమెన్...(8)

 

ఆయనే నా సంగీతము

||పల్లవి||

ఆయనే నా సంగీతము - బలమైన కొటయును

జీవాధిపతియు ఆయనే - జీవితకాలమెల్ల స్తుతించెదను             [2]

ఆయనే నా సంగీతము

 

స్తుతుల మధ్యలోన వాసం చేసి - దూతలెల్ల పొగడే దేవుడాయనే    [2]

వేడుచుండు భక్తుల స్వరము విని            [2] 

దిక్కులేని పిల్లలకు దేవుడాయనే            [2]

    ఆయనే నా సంగీతము

2.                   ఇద్దరు ముగ్గురు నా నామమున - ఏకీభవించిన వారి  మధ్యలోన    [2]   

ఉండేద ననినా మన దేవుని                [2]

 

కరములు తట్టి నిత్యం స్తుతించెదము             [2]

ఆయనే నా సంగీతము

3.                   సృష్టికర్త క్రీస్తు యేసు నామమున - జీవిత కాలమెల్ల కీర్తించెదను        [2]

రాకడలో ప్రభుతో నిత్యముందును             [2]

 

మ్రోక్కెదను స్తుతింతును పొగడెదను             [2]        ||ఆయనే||

 

తరతరాలలో

తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో

దేవుడు ....దేవుడు ....యేసే దేవుడు

హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా

1. భూమిని ఫుట్టించకమునుపు - లోకము పునాది లేనపుడు         ||దే||

2. సృష్టికి శిల్పకారుడు - జగతికి ఆధిసంభూతుడు                          ||దే||

3. తండ్రి కుమార ఆత్మయు - ఒకడై యున్నా రూపము                   ||దే||

 

నిన్నే ప్రేమింతును

1.      నిన్నే ప్రేమింతును (3)

నే వెనుదిరుగా

నీ సన్నిధిలొ మొకరించి నీ మార్గములొ సాగెధా

నీరసింపక సాగెద నే వెనుదిరు గా...

 

2.      నిన్నే పూజింతును (3)

నే వెనుదిరుగా

నీ సన్నిధిలొ మొకరించి నీ మార్గములొ సాగెద

నీరసింపక సాగెద నే వెనుదిరు గా...

 

3.      నిన్నే కీర్తింతును (3)

నే వెనుదిరుగా

నీ సన్నిధిలొ మొకరించి నీ మార్గములొ సాగెధా

నీరసింపక సాగెద నే వెనుదిరు గా...

 

4.      నిన్నే సేవింతును  (3)

నే వెనుదిరుగా

నీ సన్నిధిలొ మొకరించి నీ మార్గములొ సాగెధా

నీరసింపక సాగెద నే వెనుదిరు గా...

 

సియోను పాటలు

           సీయోను పాటలు సంతోషముగను పాడుచు సీయోను వెళ్ళుదమ

1.       లోకాన శాశ్వతానందమేమియు లేదని  చెప్పెను  ప్రియుడేసు       (2)

పొందవలె  నీ లొకమునంధు కొంతకాలమెన్నోశ్రమలు                    ||సీయోను పాటలు||

2.       ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులై యీ ధరలొ                (2)

నిత్యనివాసము లేదిలలొన నేత్రాలు కానానుపై నిల్పుడీ               ||సీయోను పాటలు||

3.       మారానుపోలిన చేదైన స్తలముల-ద్వార పొవలసియున్న నేమి        (2)

నీరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము      ||సీయోను పాటలు||

4.       ఐగుప్తు అశల నన్నియు విడిచిరంగుగ యేసుని వెంబ డించి         (2)

పాడైన కొరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి                ||సీయోను పాటలు||

5.       ఆనందమయ పరలొకంబు మనది అక్కడనుండి వచ్చునేసు      (2)  

సియోను  గీతము సొంపుగ కలిసి పాడెదము ఫ్రభుయేసుకు  జై    ||సీయోను పాటలు||

 

హల్లెలూయ పాట

||పల్లవి||

హల్లెలూయ పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చొట పాడాలి ప్రతి నొట        

హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయ (4) 

 

కష్టాలు కలిగినా కన్నీరుయే మిగిలినా

స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా    x2 

ప్రభు యేసునే వేడుమా                ||హల్లెలూయ||

2.                   బందాలు  బిగియించినా చెరసాలలో వేసినా 

స్తుతి  పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా    x2

 

ప్రభు యేసునే వేడుమా                ||హల్లెలూయ||

3.                   కరువులు కలిగినా హింసలే మిగిలిన

స్తుతి పటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా    x2

 

ప్రభు యేసునే వేడుమా                 ||హల్లెలూయ||

4.                   సిం హాల మధ్య ఉంచినా అగ్నిలో పడవేసిన

దూతలే కాపడును - భయమెమి లేకుండెను        x2

 

ప్రభు యేసునే వేడుమా                ||హల్లెలూయ||

 

హల్లెలూయ యెసు ప్రభున్

1.హల్లెలూయ యెసు ప్రభున్-ఎల్లరు స్తుతీఇంచుడి

  వల్లభునీ చెర్యలను-తిలకించి స్తుతీఇంచుడి

  బలమైనా పనిచెయు-బలవంతుని స్తుతీఇంచుడి

  ఎల్లరిని స్వీకరించి-యెసుని స్తుతీఇంచుడి

 

  రాజుల రాజైన యెసు రాజు-భుజనులా నెలున్

  హల్లెలూయ హల్లెలూయ-దెవుని స్తుతీఇంచుడి

 

2.తంబురతొను వీనతొను-ప్రభువును స్తుతీఇంచుడి

  పాపమును రక్తముతొ-కదిగెను స్తుతీఇంచుడి

  బూరతొను తాలములన్-మ్రొగించి స్తుతీఇంచుడి

  నిరంతరము మారని-యెసుని స్తుతీఇంచుడి          ...IIరాజులII

 

3.సుర్య చంద్రులార ఇల-దెవుని స్తుతీఇంచుడి

  హ్రుదయమును వెలిగించినా-దెవుని స్తుతీఇంచుడి

  అగ్ని వడగండ్లార మీరు-కర్తను స్తుతీఇంచుడి

  నిరంతరము మారని-దెవుని స్తుతీఇంచుడి          ...IIరాజులII

 

4.యువకులార పిల్లలార-దెవుని స్తుతీఇంచుడి

  జీవితమున్ ప్రభు పనికై-సమర్పించి స్తుతీఇంచుడి

  పెద్దలార ప్రభువులార-యెహొవను స్తుతీఇంచుడి

  ఆస్తులను యెసునకై-అర్పించి స్తుతీఇంచుడి          ...IIరాజులII

 

5.అగాధమైన జలములార-దెవుని స్తుతీఇంచుడి

  అలలవలె సెవకులు-లెచిరి స్తుతీఇంచుడి

  దుతలారా పూర్వ భక్తులారా-దెవుని స్తుతీఇంచుడి

  పరమందు పరిషుధులు-ఎల్లరు స్తుతీఇంచుడి      ...IIరాజులII 

 

హల్లెలూయ స్తుతి మహిమ

   హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)

 

   ఆ....హల్లెలూయ....హల్లెలూయ....హల్లెలూయ

                                                                                                                                    

1.అల సైన్యములకు అధిపతియైన 

   ఆ దేవుని స్తుతించెదము (2)

   అల సాంద్రములను దాటించిన

   ఆ యెహొవాను స్తుతించెదము (2)      ..IIహల్లెలూయII

 

2.ఆకాశము నుండి మన్నాను పంపిన

   ఆ దేవుని స్తుతించెదము(2)

   బండ నుండి మధుర జలమును పంపిన

   ఆ దేవుని స్తుతించెదము (2)          ...IIహల్లెలూయII

 

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

||పల్లవి||

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు                     x4

రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానై యున్నవాడా             x2 

మహిమ మహిమ నా యేసుకే - మహిమ మహిమ మన యేసుకే     x2

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు                     x4

2.                   కొండలలో కోనలలో లోయలలో ఆ జలములలో                 x2

 

మహిమ మహిమ నా యేసుకే - మహిమ మహిమ మన యేసుకే     x2

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు                     x4

3.                   ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా యుగయుగముల నిత్యుడా         x2

 

మహిమ మహిమ నా యేసుకే - మహిమ మహిమ మన యేసుకే     x2

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు                     x4

 

హల్లెలూయ పాడెదా

||పల్లవి||

    హల్లెలూయ పాడెదా - ప్రభు నిన్ను కొనియాడెదన్

    అన్ని వేళలయందునా - నిన్ను పూజించి కీర్తింతును

    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

    హల్లెలూయ పాడెదా - ప్రభు నిన్ను కొనియాడెదన్

                            

వాగ్దానముల నిచ్చి - నేరవేర్చువాడవు నీవే 

నమ్మకమైన దేవా - నను కాపాడు వాడవు నీవే  

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

    హల్లెలూయ పాడెదా - ప్రభు నిన్ను కొనియాడెదన్

2.                   భయమును పారద్రోలి- అభయము నిచ్చితివే

ఎబినేజరు నీవై ప్రభు-నను సం రక్షించుచుంటివే  

 

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

హల్లెలూయ పాడెదా - ప్రభు నిన్ను కొనియాడెదన్

3.                   ఎందరు నిను చూచిరో - వారికి వెలుగు కల్గెన్

ప్రభువా నే వెలుగొందితి - నా జీవంపు జ్యొతివి నీవే  

 

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

హల్లెలూయ పాడెదా - ప్రభు నిన్ను కొనియాడెదన్

4.                   కష్తములన్నింటిని - ప్రియముగ భరియింతును

నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే  

 

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

    హల్లెలూయ పాడెదా - ప్రభు నిన్ను కొనియాడెదన్

 

రుచి చూచి

రుచి చూచి ఎరిగితిని యెహొవా ఉత్తముడనియు

రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని

గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే

తప్పక ఆరాదింతు దయాలుడవు నీవే                ||రుచి చూచి||మహొన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా

ముదమార పొగడెద నీదు ఆశ్చర్యకార్యములన్         ||రుచి చూచి||మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో

ముదమార పాడెద నీవు అతి సుందరుడవనియు         ||రుచి చూచి||నా జీవితమంతయును యెహొవాను స్తుతియించెదను 

నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును             ||రుచి చూచి||కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను

క్రీస్తుని యందే తృప్తి నొంది హర్షించెదను             ||రుచి చూచి|| 

 

స్తోత్రం చెల్లింతుము

||పల్లవి||

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము

యేసు నాధుని మేలులు తలచి -

 స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము

దివారాత్రములు కంటిపాపవలె కాచి  

దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి             ||స్తోత్రం||

2.                   గాఢాంధకారములో కన్నీటిలోయలలో      

కృశించి పోనీయక కృపలతో బలపరచితివి             ||స్తోత్రం||

 

3.                   సజీవయాగముగా మా శరీరము సమర్పించి 

సంపూర్ణ  సిద్దినొంద శుద్థాత్మను నొసగితివి            ||స్తోత్రం||

 

4.                   సీయోను మర్గంలో పలు శోధనలు రాగా  

సాతన్ని జయించుటకు విశ్వాసము నిచ్చ్తివి            ||స్తోత్రం||

 

5.                   సిలువను మోసుకొని సువార్తను చేపట్టి

యేసుని వెంబడింప ఎంతభాగ్యము నిచ్చితివి        ||స్తోత్రం||

 

6.                   పాడెద హల్లెలూయ మరనాథ హల్లెలూయ

సదాపాడెద హల్లెలూయా ప్రభుయేసుకు హల్లెలూయా    ||స్తోత్రం||

 

 

 

స్తోత్రము స్తుతి స్తోత్రము

 

||పల్లవి||      స్తోత్రము స్తుతి స్తోత్రము - వేలాది వందనాలు

కలుగునుగాక నీకే మహిమ - ఎల్లప్పుడు స్తుతి స్తోత్రము     x(2)

||అనుపల్లవి ||

యేసయ్య యేసయ్య యేసయ్య     x(4)

యేసే నా రక్షణ - యేసే నా నిరీక్షణ

యేసే నా సర్వము - యేసే నా సమస్తమూ

యేసయ్య యేసయ్య యేసయ్య     x(4)

శూన్యమూ నుండి సమస్తము కలుగజేసేను 

నిరకారమైన నా జీవితమునకు రూపము నిచ్చేను    x(2)

యేసే నా రక్షణ - యేసే నా నిరీక్షణ

యేసే నా సర్వము - యేసే నా సమస్తమూ

యేసయ్య యేసయ్య యేసయ్య     x(4)        ||స్తోత్రము||

 

ఎంత మంచి దేవుడవయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా              (2)

చింతలన్ని తీరేనయ్య నిన్ను చేరగా

ఎంత మంచి దేవుడవేసయ్యా

నా చింతలన్ని తీరేనయ్య నిన్ను చేరగా

ఎంత మంచి దేవుడవేసయ్యా

1.       ఘోర పాపి నైన నేను నీకు దూరంగ పారిపోగా                  (2)              

నీ ప్రేమతో నన్ను క్షమియించి నన్ను హత్తుకున్నావేసయ్య        (2)                                      ||ఎంత మంచి||

2.                   నాకున్న వారందరూ నన్ను విడచిపోయిననూ               (2)

నన్నెంతొ ఇబ్బందులకు గురిచేసిననూ నన్ను నీవు విడువ లేదయ్యా     (2)

 

                                    ||ఎంత మంచి||

3.                   నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా              (2)

నీతో కూడా ఈలోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా            (2)   

 

                                    ||ఎంత మంచి||

 

వందనం బొనర్తుమో

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో

వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా  వందనంబు లందుకో ప్రభో        ...వందనం

 

ఇన్నిన్నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు - గన్న తండ్రి మించి యెపుడు గాచియు

ఎన్నలేని దీవెన లిడు నన్నయేసువా - యన్ని రెట్లు స్తొత్రములివిగో        ..వందనం

 

ప్రాత వత్సరంపు బాప మంతయు  - బ్రీతిని మన్నించి మమ్ము గావుము

నూతనాబ్దమునను నీదు నీతి నొసగు - మా దాత క్రీస్తు నాధ రక్షకా         ...వందనం

 

దేవ మాదు కాలు సేతు లెల్లను - సేవకాళి తనువు దినము లన్నియు

నీ వొసంగు వెండి పసిడి ఙ్ఞానమంత నీ  - సేవకై యంగీకరించుమా            ...వందనం

 

కోతకొరకు దాసజనము నంపుము - ఈ తరి మా లోటు  పాట్లు దీర్చుము

పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము - ఖ్యాతి నొందు నీతిసూర్యుడా           ...వందనం

   

మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి నీయుము

మోసపుచ్చు నంధకార మంత ద్రోయుము- యేసు కృపన్ గుమ్మరించుము    ...వందనం

 

 

ఉన్నతమైన స్థలములలో

||పల్లవి||

ఉన్నతమైన స్థలములలో - ఉన్నతుడా మా దేవా

ఉన్నతమైన నీ మార్గములు - మాకు తెలుపుము దేవా

చెదరి పొయినది మా దర్శనము - మందగించినది ఆత్మల భారం  

మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు 

నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా

నీ సన్నిధిలో సాగిలపడగా ఆత్మతో మము నింపుము దేవా

2.                   పరిశోధించుము మా హృదయములను-తెలిసికొనుము మా తలంపులను

 

ఆయాసకరమైన మార్గము మాలో - ఉన్నదేమో పరికించి చూడు

జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి  బ్రతికించుమమ్ము

మా అడుగులను నీ బండపైన - స్తిరపరచి బలపరచుము దేవా

3.                   మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగ ప్రోక్షించెదము 

 

సజీవయాగ శరీరములతో- రూపాంతర నూతన మనసులతో

నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచెత బలపడియెదము

లోకమున నీ వార్తను మేము -భారము తోడ ప్రకటించెదము

 

యేసు స్వామి నీకు నేను

యేసు స్వామి నీకు నేను - నా సమస్త మిత్తును 

నీ సన్నిధిలొ వసించి - ఆశతో సేవింతును

నా సమస్తము - నా సమస్తము

నా సురక్ష కా  నీ కిత్తు - నా సమస్తము

2.                   యేసు స్వామి నీకె నేను - దోసి  లొగ్గి మ్రొక్కెదన్

 

తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చుమిప్పుడే          ||నా సమస్తము||

3.                   నేను నీ వాడను యేసు - నీవును నావాడవు

 

నీవు నేను నేకమాయె - నీ శుద్ధాత్మ సాక్ష్యము           ||నా సమస్తము||

4.                   నీకు నన్ను యేసు ప్రభూ - ఈయనేనె యేగితి

 

నీదు ప్రేమశక్తి నింపు  - నీదుదీవె నియ్యవే            ||నా సమస్తము||

5.                   యేసు నీదె నా సర్వస్తి - హా సుజ్వాలన్ బొందితి

 

హా సురక్షణానందమా - హల్లెలుయా స్తోత్రము          ||నా సమస్తము||

 

యేసు నామము జయం జయము

||పల్లవి ||    అన్ని నామములకన్న పైనామము యేసుని నామము

ఎన్ని తరములకైన  ఘనపరచతగినది క్రీస్తేసు నామము    x(2)

||అనుపల్లవి ||

యేసు నామము జయం జయము

సాతాను శక్తుల్ లయం లయము    x(2)

హల్లెలూయా హొసన్న హల్లెలూయా - హల్లెలూయా ఆమెన్    x(2)

పాపముల నుండి విడిపించును - యేసుని నామము            x(2) 

నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును - క్రీస్తేసుని నామము        x(2)  ||యేసు||

2.                   సాతాను పై అధికారమిచ్చును శక్తికలిగిన  - యేసునామము        x(2)

 

శత్రుసమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసునామము x(2)||యేసు||

3.                   స్తుతి ఘన మహిమలు చెల్లించుచు - క్రొత్త కీర్తన పాడెదము        x(2)

 

జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర - నాదము చేయుదుము     x(2)  ||యేసు||

 

నీ చేతితో

||పల్లవి||    నీ చేతితో నన్ను పట్టుకో - నీ అత్మతో నన్ను నడుపు

శిల్పి చేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము    x(2)

1.    అంధకార లోయలోన - సంచరించిన భయము లేదు

నీ వాక్యము శక్తి గలది - నా త్రోవకు నిత్యవెలుగు            x(2)

2.    ఘోరపాపిని నేను తండ్రి - పాపఊబిలో పడియుంటిని

లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను        x(2)

3.    ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతి నీవే

కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవచేసెదన్     x(2) ||నీ ||

 

ప్రియాయేసు నిర్మించితివి

 

||పల్లవి ||    ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నా హృదయం

ముదమార వసి0చునా హృదయా0తరంగమున     x(2)

నీ రక్త ప్రభావమున - నా రోత హృదయంబును     

పవిత్రపరచుము తండ్రీ - ప్రతిపాపమును కడిగి        x(2)    ||ప్రియ||

2.                   అజాగరూకుడనైతి - నిజాశ్రయము విడచి       

 

కరుణరసముతో నాకై కనిపెట్టితివి తండ్రీ        x(2)    ||ప్రియ||

3.                   వికసించె విశ్వాసంబు - వాక్యాంబును  చదువగనె

 

చేరితి నీదుదారి - కోరి నడిపించుము        x(2)    ||ప్రియ||

4.                   ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండునట్లు       

 

ఆత్మభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా    x(2)    ||ప్రియ||

 

స్తుతియించెద నీ నామం

||పల్లవి||

    స్తుతియించెద నీ నామం - దేవా అనుదినం         [2]

 

1.    దయతో  కాపాడినావు - కృపనే చూపించినావు         [2]

    నిను నే మరువనేసు  - నిను నే విడువనేసు                  ||స్తుతి||

2.    పాపినై యుండగా నేను - రక్షించి దరిచేర్చినావు        [2]

    నిను నే మరువనేసు  - నిను నే విడువనేసు                  ||స్తుతి||   

3.    సిలువే నాకు శరణం  - నీవే నాకు మార్గం              [2]

    నిను నే మరువనేసు  - నిను నే విడువనేసు                 ||స్తుతి||

4.    వ్యాథితొ భాథింపబడగా  - స్వస్థత నాకిచ్చినావు         [2]

    నిను నే మరువనేసు  - నిను నే విడువనేసు                 ||స్తుతి||   

 

కుతుహల మార్భాటమే

||పల్లవి||

    కుతుహల మార్భాటమే  - నా యేసుని సన్నిధిలో      [2]

    ఆనందం ఆనందమే - నా ప్రియుని సముఖములో        [2]

 

1.    పాపమంత పొయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో

    క్రీస్తు నందు జీవితం కృప ద్వారా రక్షణ - పరిశుద్ద ఆత్మలో    [2]    ||కుతుహల||

 

2.     దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె  దేవాలయం నేనే

    ఆత్మలోన దేవుడు గుర్తించె నన్ను అద్బుతామాశ్చర్యమే          [2]    ||కుతుహల||

 

3.     శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయం పై జయమిచ్చును

    యేకముగ కూడి హొసన్నా పాడి - ఊరంతా చాటెదము          [2]    ||కుతుహల||

 

4.    భూరధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానై యుండే

    ఒక్క క్షణములోనే రూపాంత్రము పొంది మహిమలో ప్రవేశించెదము [2]    ||కుతుహల||

 

ప్రేమించెదన్ అధికముగ

ప్రేమించెదన్ అధికముగ

ఆరాధింతున్ ఆసక్తితో   (2)

 

||పల్లవి||

నిన్ను పూర్ణ మనస్సుతొ అరాధింతున్

పూర్ణ బలముతొ ప్రేమించెదన్ 

ఆరాధన ఆరాధనా    (4) 

ఎబినెజరే ఎబినెజరే

ఇంత వరకు ఆదుకొన్నావు    (2) 

ఇంత వరకు ఆదుకొన్నావు             ||నిన్ను పూర్ణ మనస్సుతొ||

2.            ఎల్ రొయి ఎల్ రొయి 

 

నన్ను చుచావే వందనమయ్య    (2)

నన్ను చుచావే వందనమయ్య         ||నిన్ను పూర్ణ మనస్సుతొ||

3.            యెహొవా రాఫా యెహొవా రాఫా 

 

స్వస్థపరచావే వందనమయ్యా      (2)

స్వస్థపరిచావే వందనమయ్యా          ||నిన్ను పూర్ణ మనస్సుతొ||

ప్రేమించెదన్ అధికముగ

ఆరాధింతున్ ఆసక్తితో  (2)            ||నిన్ను పూర్ణ మనస్సుతొ||

 

నా జీవం నా సర్వం

నా జీవం నా సర్వం నీవే  దేవా     (2) 

నా కొరకై బలి యైన గొర్రెపిల్ల

నా కొరకై రానున్న  ఓ మెస్సైయా 

నా జీవం నా సర్వం నీవే  దేవా     (2) 

 

తప్పిపొయిన నన్ను వెదకి రక్షించిన

మంచి కాపరి నాకై ప్రాణమిఛ్చితివి         (2)

 

ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై 

విరిగి నలిగిన హృదయమె  నేనార్పింతును   

నా జీవం నా సర్వం నీవే  దేవా     (2)

 

నీవే, నీవే, నీవే  దేవా     (4)

 

నా కొరకై బలి యైన గొర్రెపిల్ల

నా కొరకై రానున్న  ఓ మెస్సైయా 

నా జీవం నా సర్వం నీవే  దేవా     (4)

 

చిరకాల స్నేహితుడా

||పల్లవి||

    చిరకాల స్నేహితుడా - నా హృదయాన సన్నిహితుడా        [2]

    నా తొడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా

    నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా

||అనుపల్లవి||

    చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం              [2]

 

1.    బంధువులు వెలివేసినా - వెలివేయని స్నేహం

    లొకాన లేనట్టి ఓ దివ్య స్నేహం - నా యేసు నీ స్నేహం      [2]     ||చిరకాల||

2.    కష్టాలలో కన్నీళ్ళలో - నన్ను మోయు నీ స్నేహం    

    నన్ను థైర్యపరచి అదరణ కలిగించు  - నా యేసు నీ స్నేహం      [2]     ||చిరకాల||

3.    నిజమైనది విడువనది - ప్రేమించు నీ స్నేహం    

    కలువరిలొ చూపిన ఆ సిలువ స్నేహం - నా యేసు నీ స్నేహం  [2]     ||చిరకాల||

 

 

కుతుహల ఆర్భాటమే

||పల్లవి||

    కుతుహల మార్భాటమే  - నా యేసుని సన్నిధిలో  [2]

    ఆనందం ఆనందమే - నా యేసుని సన్నిధిలో  [2]

 

1.    పాపమంత పొయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో

    క్రీస్తు నందు జీవితం కృప ద్వారా రక్షణ - పరిశుద్ద ఆత్మలో        [2]    ||కుతుహల||

2.     దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె  దేవాలయం నేనే

    ఆత్మలోన దేవుడు గుర్తించె నన్ను అద్బుతామాశ్చర్యమే          [2]    ||కుతుహల||

3.     శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయం పై జయమిచ్చును

    యేకముగ కూడి హొసన్నా పాడి - ఊరంతా చాటెదము          [2]    ||కుతుహల||

4.    భూరధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానై యుండే

    ఒక్క క్షణములోనే రూపాంత్రము పొంది మహిమలో ప్రవేశించెదము    [2]    ||కుతుహల||

 

కుమ్మరీ ఓ కుమ్మరీ

||పల్లవి||

    కుమ్మరీ ఓ కుమ్మరీ - జగదుత్పత్తి దారీ

    జిగట మన్నై నా వంక –  చల్లగ చూడుమయ్యా     [2]

1.     పనికిరాని పాత్రనని పారవేయకుమా - పొంగిపొరలు పాత్రగా నన్ను నింపుమా  [2]

     సువార్తలోని పాత్రలన్నీ  శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగ నుండు పాత్రగజేసి

     సత్యముతో నింపుము తండ్రి                  [2]            ||కుమ్మరీ||

2.     విలువలేని పాత్రను నేను కొనువారు లెరెవ్వరూ -

     వెలలేని నీదు రక్తంబుతో వెలుగోందు పాత్రగజేసి     [2]

     ఆటoకములనుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా - పగిలియున్న పాత్రను నేను

     సరిచేసి వాడుమయ్యా                 [2]            ||కుమ్మరీ||

3.     లోకాశతో నిండి  ఉప్పొంగుచు మార్గంబునే తప్పితి -

    మనుష్యేచ్చలన్నియు స్థిరమనుచునే  మనశ్శాంతి కోల్పోతిని  [2]  

    పోగోట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నను పట్టితివి

    ప్రాణంబు నాలో ఉన్నప్పుడే  నీ పాదంబుల్  పట్టితిన్      [2]            ||కుమ్మరీ||

 

సిల్వలో నాకై కార్చెను

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము (2)

శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము (2)

యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)

అమూల్యమైన రక్తము యేసు రక్తము (2)

 

సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము (2)

సంధి చేసి చేర్చును యేసు రక్తము (2)

యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)

ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము (2)

 

సమాధానపరచును యేసు రక్తము (2)

సమస్యలన్ని తీర్చును యేసు రక్తము (2)

యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)

సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము (2)

 

నీతిమంతులుగా చేయును యేసు రక్తము (2)

దుర్నీతినంత బాపును యేసు రక్తము (2)

యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)

నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము (2)

 

రోగములను బాపును యేసు రక్తము (2)

దురాత్మల పారద్రోలును యేసు రక్తము (2)

యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)

శక్తి బలము నిచ్చును యేసు రక్తము (2)

 

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము (2)

శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము (2)

యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)

అమూల్యమైన రక్తము యేసు రక్తము (2)

 

ఓరన్నా ఓరన్నా

ఓరన్నా ఓరన్నా

యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా

యేసే  ఆ దైవం చూడన్నా చూడన్నా

యేసే  ఆ దైవం చూడన్నా

 

చరిత్ర లోకి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా (2)

అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును  (2) ||ఓరన్నా||

 

పరమును వీడి వచ్చాడన్నా వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా (2)

పరిశుద్దుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్నా||

 

సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా లేచాడన్నా (2)

మహిమప్రభు మృత్యుంజయుడు క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్నా||

 

మహిమలు ఎన్నో చూపాడన్నా చూపాడన్నా మార్గము తానే అన్నాడన్నా అన్నాడన్నా (2)

మనిషిగా మారిన దేవుడెగా మరణము పాపము తొలగించెను (2) ||ఓరన్నా||

 

 

దావీదు వలెనె నాట్యమాడి

దావీదు వలెనె నాట్యమాడి తండ్రీ నిన్ స్తుతించెధము (2)

 

యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము (2)

దావీదు వలెనె నాట్యమాడి తండ్రీ నిన్ స్తుతించెధము (2)

 

తంబురతోనూ సితారతోను తండ్రీ నిన్ స్తుతించెధము (2) ||యేసయ్యా||

 

కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రీ నిన్ స్తుతించెధము (2) ||యేసయ్యా||

 

పరిశుద్ద రక్తముతో పాపము కడిగిన తండ్రీ నిన్ స్తుతించెధము (2) ||యేసయ్యా||

 

 

 

మహిమ నీకే ప్రభూ

మహిమ నీకే ప్రభూ ఘనత నీకే ప్రభూ(2 )

స్తుతీ  మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభూ(2 )

 

ఆరాధనా ఆరాధనా  (2 )

ప్రియ యేసు ప్రభునకే మన యేసు ప్రభునకే  (2 )

 

సమీపింప రాని తేజస్సునందు వసియించు అమరుండవే(2 )

శ్రీమంతుడవే సర్వాదిపతివే నీ సర్వం నాకిచ్చితివే (2 )               ||ఆరాధనా||

 

ఎంతో ప్రేమించి నాకై యేతెంచి ప్రానమునర్పించితివే(2 )

విలువైనరక్తం  చిందించి నన్ను విమోచిన్చితివే (2 )                    ||ఆరాధనా||

 

ఆశర్యకరమైన నీ వెలుగులోనికి నను పిలిచి వెలిగించితివే(2 )

నీ  గుణాతిశయముల్ వరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే (2 )        ||ఆరాధనా||

 

రాజులైన యాజక సామూహముగా ఏర్పరచబడిన వంశమై(2 )

పరిశుద్ధ జనమై నీ సొంతైన ప్రజగా నన్ను చేసితివే (2 )                ||ఆరాధనా||

 

 

నాదు యేసుని ప్రేమ

అహహా అహహా అహహా అఅఅఅఆ  (2)

నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా - నన్ను మార్చిన ప్రేమ మరపురానిదే  కాదా (2)

హల్లెలూయా  హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

 

పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయంలో - దేవా నిన్ను దూషి౦చుచూ  దూరమైన వేళలో

అహహా అహహా అహహా అఅఅఅఆ

పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయంలో - దేవా నిన్ను దూషి౦చుచూ  దూరమైన వేళలో

ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా

హల్లెలూయా  హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

 

గాలిలోని  పొట్టువలే పలునిందలు నా పై మోపిననూ - వర్షములో మంచువలే బలహీనుడనై పోయిననూ

అహహా అహహా అహహా అఅఅఅఆ

గాలిలోని  పొట్టువలే పలు నిందలు నా పై మోపిననూ - వర్షములో మంచువలే బలహీనుడనై పోయిననూ

నీ బలముతో నింపితివా బలవంతుడా నీ కృపలో 

హల్లెలూయా  హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

 

 

కృపామయుడా నీలోన

కృపామయుడా నీలోన (2)

నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం   నీలొ

1) ఏ అపాయము నా గుడారము సమీపించనీయక

   నా మార్గములన్నింటిలొ నీవే ఆశ్రయమైనందున        ...కృపా...

2) చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా

   రాజ వంశములో యాజకత్వము చేసేధను               ...కృపా... 

3) నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు 

   నా పైన నిండుగా ఆత్మ వర్షము క్రుమ్మరించు            ...కృపా...

4) ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు

   నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను           ...కృపా...

 

 

నా కన్నుల కన్నీరు(ఆరాధన)

నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే

ఆరాధన, ఆరాధన

నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే

ఆరాధన, ఆరాధన

 

ఆరాధన, ఆరాధన,ఆరాధన, ఆరాధన

ఆరాధన, ఆరాధన,ఆరాధన, ఆరాధన

 

తన రక్తముతొ నన్ను కడిగిన యేసయ్యకే

ఆరాధన, ఆరాధన

తన వాక్యముతొ నన్ను కాల్చిన యేసయ్యకే

ఆరాధన, ఆరాధన

 

ఆరాధన, ఆరాధన,ఆరాధన, ఆరాధన

ఆరాధన, ఆరాధన,ఆరాధన, ఆరాధన 

 

జీవనదిని

జీవనదిని నా హృదయములొ ప్రవహింప చేయుమయ (2)

 

శరీర క్రియలన్నియు, నాలో నశియింప జేయుమయ (2)          ...జీవనదిని...

బలహీన సమయములో, నీ బలము ప్రసాదించుము  (2)         ...జీవనదిని...

ఎండినా ఎముకాలనన్నియు, తిరిగి జీవింప జేయుమయ  (2)     ...జీవనదిని...

 

ఆత్మీయ వరములతో,నన్ను అభిషేకం జేయుమయ (2)          ...జీవనదిని...

హల్లెలుయా ఆమేన్,ఆమేన్ హల్లెలుయా ఆమేన్ (2)              . ..జీవనదిని...

 

 

ఓ ప్రభువా ఓ ప్రభువా

పల్లవి: ఓ ప్రభువా ఓ ప్రభువా

         నీవే నా మంచి కాపరివి-నీవే నా మంచి కాపరివి

     1.  దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి

         నిత్య జీవము నీచ్చిన దేవా-నీవే నా మంచి కాపరివి ...IIఓ ప్రభువాII

     2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడు చెయ్య విడువక 

        అంతము వరకు కాపాడుదేవ-నీవే నా మంచి కాపరివి ...IIఓ ప్రభువాII 

     3. ప్రధాన కాపరిగ నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘఢియలో 

        నన్ను నీవు మరువని దేవా-నీవే నా మంచి కాపరివి ...IIఓ ప్రభువాII  

 

ఆశ్చర్యమైన ప్రేమ

 

       ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోన ప్రెమ - మరనముకంటె

       బలమైన ప్రెమది నన్ను జైయించె నీ ప్రెమ

 

   1.  పరమును వీడిన ప్రేమ ధరలో - పాపిని వెదకిన ప్రేమ

       నన్ను కరుణించి - ఆదరించి- సదదీర్చి- నిత్యజీవమిచ్చె ...IIఆశ్చర్యII

 

   2.  పావన యెసుని ప్రేమ - సిలువలో - పాపిని మోసిన ప్రేమ

       నాకై మరణించి - జీవమిచ్చి - జయమిచ్చి - తన మహిమనిచ్చే ...IIఆశ్చర్యII

 

   3.  నా స్థితి జూచిన ప్తేమ - నాపై - జాలిని జూపిన ప్రేమ

       నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి - కన్నీరు తుడిచె  ...IIఆశ్చర్యII 

 

నా ఆత్మ కాపరి

 

 పల్లవి : నా ఆత్మ కాపరి,నాపై సర్వాధికారి

           నన్నెచట పంపిన వెంబడింతును  

           నీ స్వరము వినుతకనే కోరుకున్నాను 

           నన్నెచట పంపిన వెళ్ళెదన్  

           నెమ్మదైన పచికలైన, సెలయేరు పుక్కనైన 

           నా ఆత్మ కాపరి నా గురువుగా

           గొప్ప కొండలు ఎదురైన లోతైన లోయలైన  

           నా ఆత్మ కాపరి నా తోడుండున్     

పరిశుధ్థాత్మ రా

పరిశుధ్థాత్మ రా, పరిశుధ్థాత్మ రా,

నన్ను నడిపించు ప్రభు పాధ సన్నీధికీ  పరిశుధ్థాత్మ రా (2) 

     

ప్రభు నీకొరకె యేసు నీకొరకె, ప్రభు నీకొరకె యేసు నీకొరకె,

ప్రభు నీకొరకె యేసు నీకొరకె, నే చేతులేత్తెదా

మోకాలూనీ, శిరస్సు వంచీ, చెతులెత్తి నిన్ను ప్రార్ధించెధ (2)

ప్రభు నీకొరకె యేసు నీకొరకె, ప్రభు నీకొరకె యేసు నీకొరకె,

ప్రభు నీకొరకె యేసు నీకొరకె, నే చేతులేత్తెదా        ||పరిశుధ్థాత్మ రా||

 

యేసే  మార్గము, యేసే  సత్యము, యేసే  నా జీవము, యేసు నా ప్రభు (2)

ప్రభు నీకొరకె యేసు నీకొరకె, ప్రభు నీకొరకె యేసు నీకొరకె,

ప్రభు నీకొరకె యేసు నీకొరకె, నే చేతులేత్తెదా

మోకాలూనీ, శిరస్సు వంచీ, చెతులెత్తి నిన్ను ప్రార్ధించెధ (2)

ప్రభు నీకొరకె యేసు నీకొరకె, ప్రభు నీకొరకె యేసు నీకొరకె,

ప్రభు నీకొరకె యేసు నీకొరకె, నే చేతులేత్తెదా         ||పరిశుధ్థాత్మ రా||

 

పరిశుద్ద పావురమా

పరిశుద్ద పావురమా, నీ పాద సన్నిధిలో

పరిపూర్ణ హృదయముతో నిన్నే స్తుతించెదను (2)

1. ఆదరించువాడా నీకే స్తోత్రములు

నన్ను నడిపించు నాయకుడా స్తోత్రములు

జీవజల బుగ్గ యొద్ద నన్ను నడుపుము

జీవాత్మతో నన్ను నింపుము యేసు

పరమ జీవము నాకు నివ్వ

పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ

నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును    

యేసు చాలును  చాలును (2)

ఏ సమయమైన ఏ స్తితికైన  

నా జీవితములో యేసు చాలును  

2.                   సాతను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను  

లోకము శరీరము లాగినను  లోబడక నేను వెళ్ళెదను                     ||యేసు చాలును||

 

3.                   పచ్చిక బయలులో పరుండచేయున్ శాంతి జలము చెంత నడిపించును    

అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును         ||యేసు చాలును||

 

4.                   నరులెల్లరు నను విడిచినను శరీము కుళ్ళి కృశించినను  

హరించినను నా ఐశ్వర్యము  విరోధివలె నను విడచినను                   ||యేసు చాలును||

 

నీ  రక్తమే  నీ  రక్తమే  

పల్లవి : నీ  రక్తమే  నీ  రక్తమే  నన్ శుద్దీకరించున్  

           నీ  రక్తమే  నా  బలము  

 

1. నీ  రక్త  ధరలే  ఇలా   - పాపి  కశ్రాయ  మిచ్చును  

పరిశుద్ధ  తండ్రి  పాపిని  - కడిగి  పవిత్ర  పరచుము  ||నీ రక్తమే||

 

2. నాసించు  వారికి  నీ  సిలువా  - వెర్రి  తనముగా  నున్నది  

రక్షింప  బడు  చున్న  పాపికి  - దేవుని  శక్తియై  ఉన్నదీ  ||నీ రక్తమే||

 

3. నీ  సిల్వలో  కార్చినట్టి  - విలువైన  రక్త ముచే   

పాప  విముక్తి  చేసితివి  - పరిశుద్ధ  దేవ  తనయుడా ||నీ రక్తమే||

 

4. నన్ను  వెంబడించు   సైతనున్  - నన్ను  బెదరించు  సైతనున్  

దునుమాడేది  నీ  రక్తమీ  - ధహించేది  నీ  రక్తమే ||నీ రక్తమే||

 

5. స్తుతి  మహిమ  ఘనతయు  - యుగ  యుగంబు  - లకును  

స్తుతి  పాత్ర  నీకే  చెల్లును  - స్తోత్రర్హుడా  నీకే  తగును  ||నీ రక్తమే||

 

యేసు రక్తము రక్తము రక్తము

యేసు రక్తము రక్తము రక్తము         2

అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము

1.ప్రతిఘోర పాపమును -కడుగును మన యేసయ్య రక్తము

బహు దుఃఖములో మునిగినే- చమట రక్తముగా మారెనే

2.మనసాక్షిని శుద్ది చేయును - మన యేసయ్య రక్తము

మన శిక్షను తొలగించెను -సంహారమునే తప్పించెను

3.మహా పరిశుద్ద స్థలములో చేర్చును -మన యేసయ్య రక్తము

మన ప్రధాన యాజకుడు- మన కంటె ముందుగా వెళ్ళెను

 

యెహొవా  ఈరె

    యెహొవా  ఈరె  చూచుకోనునే నీవుంటె చాలు నాకు

    యెహొవా రాఫా స్వస్థత నిచ్చున్ - నీ గాయమే బాగుచేయు

    యెహొవా షమ్మ తోడై ఉండి అక్కరా లన్ని తీర్చు

 

    నీ వుంటె చాలు  (3)  నాకు x2

యెహొవా ఎలోహీం సృష్టికి కర్తవు నీ వాక్కుచే కలిగే ప్రభు 

యెహొవా ఎల్యోన్ మహోన్నతుడవు  నీవంటీ వారెవరు   

యెహొవా షాలోం శాంతి ప్రదాత నా హృదిలో రమ్ము దేవ        || నీ వుంటె ||

2.                   యెహొవా ఎల్షడై శక్తి సంపూర్ణునుడా నా బలము నీవె కదా

 

యెహొవా రోహీం కాపరి నీవె నన్ను కాయుము కరుణమయా

    యెహొవా నిస్సీ జయమిచ్చు దేవ నా అభయం నీవె ప్రభు        || నీ వుంటె ||

 

మంగళమే యేసునకు

మంగళమే యేసునకు మనుజావతారునకు

శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే             ||మంగళమే యేసునకు||

పరమ పవిత్రునకు  వరదివ్యతేజునకు=   

నిరుపమానందునకు - నిపుణ వేధ్యునకు మంగళమే        ||మంగళమే యేసునకు||

2.                   దురిత సంహారునకు- వరసుగుణోదారునకు

 

కరుణా సంపన్నునకు- జ్ఞానదీప్తునకు మంగళమే        ||మంగళమే యేసునకు||

3.                   సత్యప్రవర్తునకు- సద్ధర్మశీలునకు

 

నిత్యస్వయంజీవునకు నిర్మలాత్మునకు మంగళమే         ||మంగళమే యేసునకు||

4.                   యుక్త స్తోత్రర్హునకు భక్తరక్షామణికి

 

సత్యపరంజ్యోతి యగు సార్వభౌమునకు మంగళమే        ||మంగళమే యేసునకు||

5.                   నరఘోర కలుషముల నురుమారంగ నిల

 

కరుదెంచిన మాపాలి- వర రక్షకునకు మంగళమే        ||మంగళమే యేసునకు||

6.                   పరమ పురివాసునకు –  నరదైవ రూపునకు-

 

పరమేశ్వర  తనయునకు- ప్రణూతింతుము నిన్ను మంగళమే||మంగళమే యేసునకు||

 

వివాహమన్నది

వివాహమన్నది -పవిత్రమైనది

ఘనుడైన దేవుడు ఏర్పరచినది

దేహములో సగ భాగముగా - మనుగడలో సహచరీనిగా      

నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు        ||వివాహమన్నది||

2.                   వంటరిగా ఉండరాదని - జంటగా ఉండ మేలని           

 

శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు    ||వివాహమన్నది||

3.                   దేవునికి అతి ప్రియులుగా - ఫలములతో వృధిపొందగా       

 

వేరుగా నున్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు        ||వివాహమన్నది||

 

యేసయ్య నా హృదయ స్పందన నీవే కదా

యేసయ్య నా హృదయ స్పందన నీవే కదా         x2

విశ్వమంతా  నీ నామము ఘన నీయము           x2 

యేసయ్య నా హృదయ స్పందన నీవే కదా

నీవు కనిపించని రోజున- ఒక క్షణమొక యుగముగా మారెనే            x2 

నీవు నడిపించిన రోజున- యుగయుగాల తలపు మదినిండెనే            x2

యుగయుగాల తలపు మదినిండెనే                    ||యేసయ్య||

2.                   నీవు మట్లాడని రోజున- నా కనులకు నిద్దుర కరువాయెనే            x2

 

నీవు పెదవిప్పిన రోజున- నీ సన్నిధి పచ్చిక బయలాయెనే            x2

నీ సన్నిధి పచ్చిక బయలాయెనే                    ||యేసయ్య||

3.                   నీవు వరునిగా విచ్చేయు వేళ - నా తలపుల పంట పండునే             x2

 

వధువునై నేను నిను చేరగా - యుగయుగాలు నన్నేల్లు కొందువనే        x2

    యుగయుగాలు నన్నేల్లు కొందువనే                    ||యేసయ్య||

 

 

 

 

 

స్తుతి ఆరాధనా  పరిశుద్ధునకే

స్తుతి ఆరాధనా  పరిశుద్ధునకే - జీవాధిపతి అయిన యేసునకె                             (2)

మనసార పూజింతును  నా రక్షకా - నా అధారం నీవే  నా ప్రేమా మయుడా              (2)

మహిమా ప్రభావములు నీకే చెల్లింతు - మహిమా ప్రభావములు నీకే అర్పింతు              (2)

మనసార పూజింతును  నా రక్షకా - నా అధారం నీవే  నా ప్రేమా మయుడా             (2)

 

స్తుతి ఆరాధనా  పరిశుద్ధునకే

స్తుతి ఆరాధనా  పరిశుద్ధునకే - జీవాధిపతి అయిన యేసునకె                             (2)

మనసార పూజింతును  నా రక్షకా - నా అధారం నీవే  నా ప్రేమా మయుడా              (2)

మహిమా ప్రభావములు నీకే చెల్లింతు - మహిమా ప్రభావములు నీకే అర్పింతు              (2)

మనసార పూజింతును  నా రక్షకా - నా అధారం నీవే  నా ప్రేమా మయుడా             (2)

 

 

మహాదేవుని సేవించెదము

మహాదేవుని సేవించెదము

మహాదేవుని సేవించెదము

భూమ్యాకాశములు దూతలు పూజింతురు

మహాదేవుని సేవించెదము

What a mighty God we serve

What a mighty God we serve

What a mighty God we serve

Angels bow before Him

Heaven and earth adore Him

What a mighty God we serve.

 

 

యేసు  పరిశుద్ధ

పల్లవి : యేసు పరిశుద్ధ  నామమునకు

    ఎప్పుడు అధిక స్తోత్రమే

ఇహ  పరమున  మేలైన  నామము  -శక్తి  కల్గినట్టి  నామమిది  

పరిశుద్ధులు  స్తుతించు  నామమిది  (2)

2.                   సైతనున్ పాతాలమును  జయించు  - వీరత్వము  గల  నామమిది

 

జయమొందేదము  ఈ  నామామున  (2)

3.                   నశించు  పాపుల  రక్షించ  లోక  - మునకేతేంచిన  నామమిది  

 

పరలోకమున  చేర్చు  నామమిది (2)

4.                   ఉత్తమ  భక్తులు  పోగాది  స్తుతించు  - ఉన్నత  దేవుని  నామమిది

 

లోకమంతా  ప్రకాశించే  నామమిది  (2)

5.                   శోధన  గాధల  కష్ట  సమయాన  ఓదార్చి  నడుపు  నామమిది

 

ఆటంకము  తీసివేయు  నామమిది  (2)

 

 

కన్నతల్లి చేర్చునట్లు

కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు (2)

హల్లెలూయ  హల్లెలూయ  - హల్లెలూయ హల్లెలూయ  

1. కౌగిటిలో హత్తుకొనున్ - నా చింతలన్ బాపును (2) || కన్న||

2. చేయిపట్టి నడుపును - శిఖరము పై నిలుపును (2) || కన్న||

3.నా కొరకే మరణించే - నా పాపము భరీయించే      (2) || కన్న||

4. చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎప్పుడు (2) || కన్న||

 

రండి యుత్సహించి పాడుదము

రండి యుత్సహించి పాడుదము

రక్షణ దుర్గము మన ప్రభువే                 x2

రండి కృతజ్ఞత స్తొత్రముతో 

రారాజు సన్నిది కేగుదము             x2

సత్ప్రభు నామము కీర్తనలన్

సంతోష గానము చేయుదము           || రండి ||

2.                   మన ప్రభువే మహా దేవుండు

 

ఘన మాహాత్మ్యముగల రాజు         x2

భూమ్యగాధపు లోయలును

భూధర శిఖరము లాయనవే              || రండి ||

3.                   సముద్రము సృష్టించె ఆయనదే

 

సత్యుని హస్తమే భువి చేసెన్            x2

ఆయన దైవము పాలితుల

మాయన మేపెడి గొఱ్ఱెలము                    || రండి ||

4.                   ఆ ప్రభు సన్నిధి మోకరించి

 

ఆయన ముందర మ్రొక్కుదము           x2

ఆయన మాటలు గైకొనిన

నయ్యవి మనకెంతొ మేలగును                    || రండి ||

5.                   తండ్రి కుమార శుద్ధాత్మకును

 

దగు స్తుతి మహిమలు కల్గుగాక          x2

ఆదిని నిప్పుడు నెల్లపుడు

    నయినట్లు యుగములు నౌను అమెన్         || రండి ||   

 

యుద్దము యేహోవాదే

యుద్దము యేహోవాదే (4)

1.      రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు

సైన్యములకు అధిపతియైన యేహోవా మన అండ                యుద్దము ...4

2.      వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన

విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ                      యుద్దము ...4

3.      యెరికొ గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా

అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక                    యుద్దము ...4